Leopard : కామారెడ్డి జిల్లాలో చిరుతపులి

కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది

Update: 2025-07-24 04:46 GMT

కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. గత కొద్దిరోజులుగా చిరుత పులి కదలికలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా చిరుతపులి కామారెడ్డి జిల్లాలో ఆవును చంపడంతో ప్రజలు మరింత భయాందోళనలు చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.

ఆవును చంపి..
అయితే చిరుతపులి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందని అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒంటరిగా అడవుల్లోకి వెళ్లవద్దని, అలాగే పెంపుడు జంతువులను కూడా బయట విడిచిపెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పులి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు.


Tags:    

Similar News