జాతీయ రహదారిపైకి చిరుతపులి.. దానిని చూసిన వాహనదారులు
ఆదిలాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. అర్థరాత్రి సమయంలో రోడ్డు దాటుతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
leapord in adilabad district
ఆదిలాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. అర్థరాత్రి సమయంలో రోడ్డు దాటుతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిర్మల్ - ఆదిలాబాద్ జాతీయ రహదారిపై ఈ దృశ్యాలు వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
స్థానికుల్లో ఆందోళన...
అయితే జాతీయ రహదారిపై నుంచి చిరుతపులి కనిపించడంతో ఆ ప్రాంతంలో రాత్రి వేళ వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. చిరుతపులి రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నప్పటికీ చిరుతపులి ఇక్కడే సంచరిస్తుందని భావించి భయాందోళనలకు గురవుతున్నారు.