Leopard : చెట్టుపైన చిరుతపులి.. పరుగులు తీసిన జనం

కొమురం భీం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. చెట్లుపై ఉన్న చిరుతను గుర్తించారు

Update: 2025-02-02 04:38 GMT

కొమురం భీం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. జిల్లాలోని చింతపుల్లిలో చిరుతపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. చెట్టుపై ఉన్న చిరుత పులిని కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చారు.

పాదముద్రలను సేకరించి...
చిరుతపులి పాదముద్రలను కూడా సేకరించారు. అయితే చిరుతపులి అక్కడే తిరుగుతుందని గ్రామస్థులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా సాయంత్రం వేళ బయటకు వెళ్లవద్దని, పశువుల మేతకు వెళ్లే వారు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. చిరుతపులిని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


Tags:    

Similar News