పొదల్లో కదల్లేని స్థితిలో చిరుత

మెదక్, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని చేగుంట మండల జైత్రాం తండా, దౌల్తాబాద్‌ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో చిరుత కనిపించింది.

Update: 2025-11-11 15:08 GMT

మెదక్, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని చేగుంట మండల జైత్రాం తండా, దౌల్తాబాద్‌ మండలం గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో చిరుత కనిపించింది. రైతులు, పశువుల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ చిరుత ఓ చెట్టు పొదల్లో కదలకుండా ఉండిపోయింది. అటవీ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. నాలుగైదు రోజుల పాటు ఈ అటవీ ప్రాంతం వైపు రావొద్దని బీట్‌ అధికారి సూచించారు. చిరుత నీరసంగా ఉందని, ఎటూ కదలలేకపోతోందని దీనికి కారణాలు తెలియాల్సి ఉందని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News