Leopard : రెండు తెలుగు రాష్ట్రాల్లో పులి తో భయం.. భయం

తెలుగు రాష్ట్రాల్లో చిరుతపులి టెన్షన్ పుట్టిస్తుంది. గ్రామాల్లోకి వస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-11-30 04:38 GMT

leapord in tirumala 

తెలుగు రాష్ట్రాల్లో చిరుతపులి టెన్షన్ పుట్టిస్తుంది. అటవీ ప్రాంతాల నుంచి నేరుగా గ్రామాల్లోకి వస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుమరం భీ ఆసిఫా బాద్ జిల్లాలో చిరుతపులి దాడిలో లక్ష్మి అనే యువతి మరణించిన నేపథ్యంలో గ్రామస్థులు బితుకుబితుకు మంటూ గడుపుతున్నారు. అక్కడే పులి సంచరిస్తున్నట్లు అధికారులు కూడా చెబుతున్నారు. దీంతో గ్రామస్థులు ఒంటరిగా రాత్రి వేళ బయటకు రావడానికి భయపడుతున్నారు. పొలాలకు వెళ్లాలన్నా బితుకు బితుకుమంటూ వెళుతున్నారు.

పెంచలకోనలో....
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని పెంచలకోన లో చిరుతపులి స్థానికులకు కనిపించడంతో భయాందోళనలు చెందుతున్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోనలో చిరుతపులిని స్థానికులు చూశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుతపులి ఇదే ప్రాంతంలో సంచరిస్తుందని, బయటకు రావద్దని, పెంపుడు జంతువులను కూడా బయటకు వదలవద్దని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పులి జాడను కనుగొనేందుకు అవసరమైన చర్యలు అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్నారు. ప్రకాశంజిల్లాలో కూడా పులి సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 


Tags:    

Similar News