Telangana : ఆరుగురు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఆరుగురు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు

Update: 2025-09-19 03:11 GMT

తెలంగాణ శాసనసభలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఆరుగురు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి తర్వాత పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే దీనిపై సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించడంతో మూడు నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇందులో భాగంగా స్పీకర్ ఆరుగురు ఎమ్మెల్యేలు తమ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

మరిన్ని ఆధారాలు కావాలని...
పార్టీ మారిన ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్ి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహీపాల్ రెడ్డిలకు నోటీసులు స్పీకర్ జారీ చేశారు. వారు గతంలో ఇచ్చిన వివరణలకు సంబంధించి మరిన్ని ఆధారాలు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఆ నోటీసులలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారు ఇచ్చిన వివరణలపై ఫిర్యాదు చేయడంతో స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. మరి ఈ సారి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం ఆధారాలు సమర్పిస్తారో చూడాలి.


Tags:    

Similar News