Telangana : రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొంటాం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ యాసంగి సీజన్‌లో 90 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించేందుకు 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 16 కోట్లకు పైగా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామని, సన్నరకాలకు మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు.
అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు...
అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్ల సమస్యలను కేంద్ర ఆహార మంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తాం తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.