Telangana : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలోని పెట్రోలు బంకులు ఇక అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు కాబోతున్నాయి. ఇందిరా మహిళాశక్తి పథకం కింద నారాయణపేట, సంగారెడ్డిలలో ఇప్పటికే ఏర్పాటు చేసిన బంకులు లాభాలతో నడుస్తున్నాయి.
మరో నలభై చోట్ల...
దీంతో తెలంగాణ ప్రభుత్వం మరో 40 చోట్ల బంకులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటికి స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా.. త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే IOC, BP, HP సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. ఈ బంకులను జూన్ 2 నాటికి పూర్తిచేసి ప్రారంభించాలని సెర్ప్ భావిస్తోంది.