KTR : నేడు కేటీఆర్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ కానున్నారు
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ కానున్నారు. సీనియర్ నేతలతో కేటీఆర్ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ నేతలో చర్చించి పలు కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకునే అవకాశముంది.
మున్సిపల్ ఎన్నికల్లో...
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకునేలా వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సరైన అభ్యర్థులను పోటీకి దింపడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించనున్నారు. అనంతరం అనంతరం ఉదయం పది గంటలకు భారీ ర్యాలీ నిర్వహించనున్నార. సికింద్రాబాద్‌ను కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేయనున్నారు.