Telangana : ఎమ్మెల్యే కోమటిరెడ్డి షరతులివే
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైన్ షాపులను ఊరి బయటే పెట్టాలన్నారు. మహిళల సాధికారికతే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అభిప్రాయపడ్డారు. బెల్ట్ షాపుల్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. ఎవరూ గ్రామాల్లో పెట్టే వైన్ షాపులకు టెండర్లు వేయవద్దంటూ ఆయన పిలుపు నిచ్చారు.
మునుగోడు నియోజకవర్గంలో...
మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ లకు టెండర్లు వేసే వారు కొన్ని షరతులకు లోబడి టెండర్లు వేయాలన్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ మాత్రమే మద్యాన్ని విక్రయించాన్నారు. వైన్ షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు ఉండకూదదని తెలిపారు. లాటరీ ద్వారా సాధించుకున్న వారు సిండికేట్ గా కాకూడదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలో వైన్ షాపులకు టెండర్లు వేసే వారు స్థానికులై ఉండాలన్నారు. షరతులు ఉల్లంఘించి టెండర్లు వేస్తే ఊరుకోబోమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.