Danam Nagender : నా ఇంట్లో వైఎస్సార్, కేసీఆర్ ఫొటోలుంటే ఏంటట?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-02-04 06:49 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్ల జోలికి వస్తే తాను ఊరుకునేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైడ్రాను తాను వ్యతిరేకిస్తూనే ఉంటానని తెలిపారు. తన ఇంట్లో వైఎస్సార్, కేసీఆర్ ఫొటోలున్నాయని, అందుకు అభ్యంతరం ఎవరికి ఉంటుందని దానం నాగేందర్ ప్రశ్నించారు. తాను కాంప్రమైజ్ అయ్యేవాడిని కానని, అవసరమైతే జైలుకు వెళతానని అన్నారు.

కేసులు పెట్టినా...
తనపై అనేక కేసులున్నాయని, పేదల కోసం మరిన్ని కేసులు ఎదుర్కొనడానికి కూడా సిద్ధమని దానం నాగేందర్ ప్రకటించారు. తన నియోజకవర్గంలో పేదల పక్షాన నిలబడతానని, అందుకు ఎంత దూరమైనా వెళతానని దానం నాగేందర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన తెలిపారు.


Tags:    

Similar News