Formual E Car Race Case : అరవింద్ కుమార్ వాంగ్మూలం కీలకంగా మారనుందా?

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ వాంగ్మూలంలో కీలక అంశాలు వెలుగు చూసినట్లు తెలిసింది

Update: 2025-07-04 05:26 GMT

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ వాంగ్మూలంలో కీలక అంశాలు వెలుగు చూసినట్లు తెలిసింది. ఫార్ములా ఈ కేసులో నిన్న సిట్‌ ఎదుట అరవింద్ కుమార్ వాంగ్మూలం ఇచ్చారు. అయితే అప్పటి మంత్రి ఆదేశాల మేరకే తాను నడుచుకున్నానని చెప్పారు. ఫార్ములా ఈ కేసులో తన తప్పేమీలేదన్న అరవింద్‌ కుమార్ అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలనే పాటించానని వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది.

నిధులు మళ్లించినట్లు...
ఫార్ములా ఈ కారు రేస్‌ కోసం హెచ్ఎండీఏ నిధులను వినియోగించినట్టు అంగీకారించిన అరవిందకుమార్ రేస్‌ కోసం స్పాన్సర్‌ను వెతికే సమయం లేకపోవడంతోహెచ్ఎండీ నే స్పాన్సర్ గా, ప్రమోటర్‌గా వ్యవహరించిందని సిట్ అధికారులకు తెలిపారు. ఎఫ్ఈఓకు 45.71 కోట్లు, పన్నులరూపంలో 8 కోట్ల రూపాయలు చెల్లించామని, నిధుల వినియోగంలో ఎలాంటి తప్పు చేయలేదని అరవింద్‌ కుమార్ చెప్పినట్లు సమాచారం.








Tags:    

Similar News