Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావు తిరిగి రానున్నారు.

Update: 2025-06-01 03:41 GMT

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావు తిరిగి రానున్నారు. ఈ నెల 5వ తేదీన తాను విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతారని చెప్పారు. విచారణకు పూర్తిగా తాను సహకరిస్తానని ప్రభాకర్ రావు తెలిపారు.

కీలక నిందితుడిగా...
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్నారు. అయితే ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యం పేరుతో అమెరికాలో ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు లో ప్రభాకర్ రావు కు ఊరట దక్కడంతో తాను విచారణకు హాజరవుతానని తెలిపారు. ప్రభాకర్ రావును విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని సిట్ అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News