Telangana : ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో కీలక పురోగతి
తెలంగాణలో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
తెలంగాణలో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ నివేదిక విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల వద్దకు చేరింది. ఐఏఎస్ అధికారిఅరవింద్ కుమార్, హెచ్ఎండీఏ విశ్రాంత అధికారి బీఎల్ఎన్ రెడ్డికి సంబంధించి ప్రాసిక్యూషన్ కు సంబంధించిన తుది నివేదిక చేరనుంది. ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో ప్రభుత్వానికి చేరిన ఏసీబీ నివేదికను గవర్నర్ వద్దకు పంపింది.
ఏసీబీ నివేదికను...
ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ తొమ్మిది నెలల పాటు విచారణ జరిపింది. తర్వాత విచారణలో వెలుగు చూసిన విషయాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారిఅరవింద్ కుమార్, హెచ్ఎండీఏ విశ్రాంత అధికారి బీఎల్ఎన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ గవర్నర్ వద్దకు పంపింది. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.