తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తెలంగాణకు రానున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తెలంగాణకు రానున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే దీనిపై ఇంకా తేదీలు ఖరారు కాలేదు. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
భారీ బహిరంగ సభకు...
ఈ నెల, వచ్చే నెలలో ప్రధాని మోదీ పర్యటన తెలంగాణలో ఉండే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులను ఆయన ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపనలను కూడా చేయనున్నారు. తేదీ ఖరారయిన తర్వాత బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.