దాసోజు సుదీర్ఘ నిరీక్షణకు తెర

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ ను కేసీఆర్ ప్రకటించారు

Update: 2025-03-10 02:13 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ ను కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో దాసోజ్ శ్రావణ్ ను బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా డిసైడ్ చేసింది. నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి చూసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కేసీఆర్ ఆదేశించారు. నేడు ఉదయం పదకొండు గంటలకు దాసోజు శ్రావణ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.

మూడు పార్టీలు మారి...
మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఖచ్చితంగా ఒకటి బీఆర్ఎస్ ఖాతాలో పడనుంది. అయితే అనేక పేర్లు వినిపించినా చివరకు దాసోజు శ్రావణ్ పేరును ఆయన ఖరారు చేయడంతో శ్రావణ్ ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ ఉండి తర్వాత కాంగ్రెస్ లోకివెళ్లి మళ్లీ బీజేపీలోకి మారి అనంతరం తిరిగి కారు పార్టీ గూటికే దాసోజు శ్రావవణ్ చేరి ఎమ్మెల్సీ పదవిని చేజిక్కించుకున్నారు.


Tags:    

Similar News