Breaking : కేసీఆర్ కు హైకోర్టు లో ఎదురుదెబ్బ
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావులకు ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది.
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావులకు ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టేందుకు ఆరు నెలలు గడువు విధించింది. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్వర్వులను ఇవ్వలేమని చెప్పింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వాలని కేసీఆర్, హరీశ్ రావులు వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు.
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని...
ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు నిన్న విచారించింది. ఈరోజు అడ్వొకేట్ జనరల్ నేడు అసెంబ్లీలో నివేదిక పెట్టడంపై హైకోర్టుకు క్లారిటీ ఇవ్వడంతో మధ్యంతర ఇవ్వలేమని చెప్పింది. ఈ కేసులో విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. దీంతో హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు చుక్కెదురయిందని చెప్పాలి. పూర్తి స్థాయి కౌంటర్ ను దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్ ను కోరింది.