Telangana : తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావుకు ఊరట

తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావుకు ఊరట లభించింది.

Update: 2025-09-02 05:49 GMT

తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావుకు ఊరట లభించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 7వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు పిటీషన్ వేశారు.

అక్టోబరు 7వ తేదీకి...
అయితే నేడు విచారించిన హైకోర్టుకు ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించామని అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. అయితే సీబీఐ దర్యాప్తునకు, కమిషన్ నివేదికకు సంబంధం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. మరొకవైపు అక్టోబరు 7వ తేదీ వరకూ విచారణ వాయిదా వేస్తూ, తదుపరి విచారణ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.


Tags:    

Similar News