Kavitha : ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవిత సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కేవలం మున్సిపల్ ఎన్నికల కోసమే తెరమీదకు తెచ్చారని కవిత ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల గురించి ఎవరూ ప్రశ్నించకుండా డైవర్ట్ చేయడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణను ప్రభుత్వం తీసుకు వచ్చారంటూ కవిత మండిపడ్డారు.
ఇద్దరూ కలసి...
అంతకు ముందు ఎందుకు విచారణ జరగలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ వల్ల తన లాంటి వారికి న్యాయం జరగదని కవిత స్పష్టం చేశారు. రెండు పార్టీలు కలసి డ్రామాలు ఆడుతున్నాయని స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందని కవిత తెలిపారు. రెండు పార్టీలు కలసి ప్రజలను మభ్యపెట్టడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ మళ్లీ మొదటికి తెచ్చారంటూ కవిత అన్నారు.