Kalvakuntla Kavitha : కవిత రాజీనామా అక్కడే ఆగిందా? బీఆర్ఎస్ ఏమంటోంది?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు

Update: 2025-09-30 12:19 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. 2021లో ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో నిజామాబాద్ పరిధిలోని స్థానిక సంస్థలలో ఎక్కువ భాగం బీఆర్ఎస్ చేతిలోనే ఉండేవి. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ సంఖ్యలో నాడు నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. దీంతో నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత సులువుగా ఎన్నికయ్యారు. పెద్దల సభలోకి అడుగు పెట్టారు. అయితే ఆమె ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కవిత పదవీకాలం మరో రెండేళ్ల సయం ఉంది. స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా ఆమోదించినప్పటికీ కల్వకుంట్ల కవిత రాజీనామా మాత్రం ఆమోదం పొందలేదు.

ఫలితాల తర్వాతనేనా...
అలాగే పార్టీ పరంగా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయడంతో తనకు పార్టీ పరంగా వచ్చిన పదవులను కూడా వదులు కున్నారు. అయితే ఇంత వరకూ ఆమె రాజీనామా మాత్రం ఆమోదం పొందలేదు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే కల్వకుంట్ల కవితతో ఫోన్ లో మాట్లాడి ఆవేశంతో నిర్ణయం తీసుకోవద్దని, ఆలోచించి రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే తాను ఆలోచించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కల్వకుంట్ల కవిత చెప్పారని తెలిసింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజీనామాను మాత్రం శాసనమండలి ఛైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ తో...
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించిన తర్వాత మాత్రమే ఆమె రాజీనామా ఆమోదం పొందుతుందన్న కామెంట్స్ బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. ఇప్పుడు రాజీనామా ఆమోదించినా స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ బలంగా ఉందని, అందుకే లోకల్ బాడీస్ ఎన్నికల తర్వాత కవిత రాజీనామా ఆమోదించే అవకాశముందని చెబుతున్నారు. మరొకవైపు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి బాగా ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే ఈ నెల 3వ తేదీన కల్వకుంట్ల కవిత రాజీనామా చేసినప్పటికీ ఇప్పటి వరకూ ఆమోదించలేదన్నది బీఆర్ఎస్ వర్గాల వాదన. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఇక ఫలితాల తర్వాత మాత్రమే రాజీనామా ఆమోదం పొందే అవకాశముందని అంటున్నారు. కవిత కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు


Tags:    

Similar News