Telangana : కామారెడ్డి రైతుల‌కు పరిహారం అందేదెన్నడు?

భారీ వర్షాలు క‌మారెడ్డిని ముంచెత్తి నెల రోజులు గడిచినా రైతులకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు

Update: 2025-10-13 07:46 GMT

భారీ వర్షాలు క‌మారెడ్డిని ముంచెత్తి నెల రోజులు గడిచినా రైతులకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు. వర్షాల వల్ల పంటలు, బోర్లు, వ్యవసాయ పరికరాలు నష్టపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల వల్ల రాజంపేట్ మండలంలోని గిరిజన తండాలు, మల్లారెడ్డిపల్లి, చిన్న మల్లారెడ్డిపల్లిలో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. అనేక చెరువులు తెగిపోవడంతో గ్రామాలు, కాలనీలు, పొలాలు నీటమునిగాయి. రైతుల ఆస్తి నష్టంతో పాటు వ్యవసాయ పరికరాలు కూడా దెబ్బతిన్నాయి.

ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ప్రాంతంలో పర్యటించి నష్టపోయిన రైతులకు సాయం అందిస్తామని ప్రకటించారు. మరొకవైపు తెలంగాణ ప్రభుత్వం నష్టం అచనాలను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ సర్కార్ ఖాజానకు ఇప్పటి వరకూ వరద సాయం అందలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కామారెడ్డి రైతులకు నష్టపరిహారం అందించలేదు. దీంతో కామారెడ్డి రైతులు ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News