Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత ఉప రాష్ట్రపతి ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత ఉప రాష్ట్రపతి ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ బిడ్డగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలని తాను కోరుకుంటున్నానని కల్వకుంట్ల కవిత తెలిపారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో...
బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంది. ఎన్డీఏ కూటమి, ఇండి కూటమిలకు సమాన దూరంగా ఉండాలని భావించిన పార్టీ అధినేత ఎన్నికలకు దూరంగా ఉండాలాని నిర్ణయించారు. అయితే కల్వకుంట్ల కవిత మాత్రం కాంగ్రెస్ బలపర్చిన ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవడాన్ని కోరుకుంటున్నట్లు తెలపడం మరోసారి పార్టీలో హాట్ టాపిక్ అయింది.