తెలంగాణ జాగృతి పేరుతోనే...
కవిత తాను బీఆర్ఎస్ లీడర్ నే అని చెప్పుకుంటున్నారు. తమ నేత కేసీఆర్ అంటున్నారు. కానీ కార్యక్రమాలు మాత్రం జాగృతి పేరుతో చేస్తున్నారు. కవిత ఈ సొంత రాజకీయం చేయడం పార్టీకి నష్టమా? లాభమా? అన్న చర్చ గులాబీ పార్టీ నేతల్లోనే వినిపిస్తుంది. రేపు భవిష్యత్ లో తెలంగాణ జాగృతి నేతలకు టిక్కెట్లు కావాలన్న డిమాండ్ కూడా కల్వకుంట్ల కవిత ఉంచబోతున్నట్లు సమాచారం. తన అనుచరులకు ఇన్ని సీట్లు ఇస్తేనే తాను పార్టీకి మద్దతుగా ఉంటానని, లేకపోతే వేరే కుంపటిపెట్టుకుంటానన్నహెచ్చరికలు కూడా చేసేఅవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే కల్వకుంట్ల కవిత సొంతంగా ప్రజా ఉద్యమాలు చేపడుతున్నారన్న అనుమానం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. క
వరస కార్యక్రమాలతో...
కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ల కోసం ఆ మధ్య రైల్ రోకుకు పిలుపునిచ్చారు.అయితే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేయడంతో ఆ కార్యక్రమాన్నివాయిదా వేసుకన్నారు. కానీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సంబరాలు చేసి వాయిదా వేసుకున్నారు. భద్రాచలం రామాలయ భూముల గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. హిళలకు డబ్బులు ఇస్తామన్న కాంగ్రెస్ హామీపై పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. అందులో స్వయంగా పాల్గొన్నారు కూడా. ధర్నా చౌక్ దగ్గర ఎవరైనా ధర్నాలు చేస్తూంటే వెళ్లి మద్దతు పలుకుతున్నారు. కవితతో పోటీగా రాజకీయాలు చేయడంలో బీఆర్ఎస్ విఫలవుతోందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
తాజా నిర్ణయం అదేనా? .
కవిత రాజకీయాలను ఎలా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలు మాత్రం లేవనే చెప్పాలి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్లుంటుందన్న పరిస్థితిలో కారు పార్టీ ఉంది. కవితను సస్పెండ్ చేయడంతో ఆమె మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నాయి. కేసీఆర్ నుంచి సరైన నిర్ణయం కూడా లేకపోవడంతో ఎవరూ కిమ్మనడం లేదు. బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలని ఈ దీక్షను సొంతంగానే చేపట్టారు. దీంతో బీఆర్ఎస్ కూడా ఆరోతేదీ కరీంనగర్ లో ఇదే అంశంపై ఆందోళన కార్కక్రమం చేపట్టాలని భావించింది.కానీ భారీ వర్షాలు కారణంగా అది వాయిదా వేసుకుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత తన జాగృతి తరుపున అభ్యర్థిని దించితే బీఆర్ఎస్ గెలుపు పై ప్రభావం చూపుతుందని అంచనాలు విపడుతున్నాయి. మొత్తం మీద కవిత కారు పార్టీలో నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.