Kalvakuntla Kavita : అమిత్ షా కాదు.. అబద్దాల బాద్‌షా

పదేళ్ల నుండి సిలిండర్ ధర విషయంలో ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య గొడవ జరుగుతుందని కల్వకుంట్ల కవిత అన్నారు

Update: 2023-11-25 13:43 GMT

పదేళ్ల నుండి సిలిండర్ ధర విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య గొడవ జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్సెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతూ తిరుగుతున్నా రన్నారు. ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత బీజేపీ, కాంగ్రెస్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి తప్పు చేస్తే ఆగమాగం కావాల్సి ఉంటుందని అన్నారు.

సెటైర్లు వేస్తూ...
ఆయన హోం మంత్రి అమిత్ షా కాదని.. అబద్దాల బాద్‌షా అని కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ఎయిరిండియాతో పాటు దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్మేసినవారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారంటూ సెటైర్ వేశారు. ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీని మూసి వేయించిందే బీజేపీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ ఎంపీ. అని ఆమె అన్నారు. మీలా నలుగురి కుటుంబం కాదు మాది....నాలుగు కోట్ల తెలంగాణ కుటుంబం మాది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.


Tags:    

Similar News