Telangana : నేడు మహబూబ్ నగర్ జిల్లాలో కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ సందర్శిస్తారు. ఉదయం 10:30 గంటలకు జడ్చర్లలోని మీనాంభరం దేవాలయం కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు దేవరకద్ర నియోజకవర్గంలోని కరివెన రిజర్వాయర్ సందర్శిస్తారు.
జనంబాట కార్యక్రమంలో భాగంగా...
మధ్యాహ్నం 3 గంటలకు దేవరకద్ర నియోజకవర్గంలోని అప్పంపల్లి తెలంగాణ అమరవీరుల స్థూపానికి కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5గంటలకు కురుమూర్తి ఆలయాన్ని సందర్శించనున్నారు. కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. భారీ సంఖ్యలో జాగృతి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.