కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదికలో ఏముందంటే?
కాళేశ్వరం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పూర్తిస్థాయి నివేదిక సిద్ధమయింది
కాళేశ్వరం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పూర్తిస్థాయి నివేదిక సిద్ధమయింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదిహేడు మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ పైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది.
ఇంజినీర్లపై చర్యలు...
విజిలెన్స్ రిపోర్ట్‌లో పలువురు మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్లు, ప్రస్తుత చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్ల పేర్లు ఉన్నట్లు సమాచారం. దాదాపు ముప్ఫయి మూడు మంది ఇంజినీర్లకు జరిమానా విధించాలని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ సిఫార్సు చేసింది. ఏడుగురు రిటైర్డ్ ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విజిలెన్స్ నివేదిక లో పేర్కొన్నారు.