Jubilee Hills Bye Election : రేవంత్ రెడ్డికే అసలు పరీక్ష.. అందుకే సర్వశక్తులూ ఒడ్డి?

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ అని చెప్పాలి

Update: 2025-11-08 12:49 GMT

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ అని చెప్పాలి. ఈ ఉప ఎన్నిక ఫలితంతో అన్ని అనుమానాలకు చెక్ పెట్టవచ్చన్నది ఆయన ఆలోచన. అదే సమయంలో ఏ మాత్రం తేడా వచ్చినా అందుకు రేవంత్ రెడ్డి పార్టీ పరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి హోదాలో కూడా రేవంత్ రెడ్డి బస్తీ పర్యటనలు చేస్తూ, కార్నర్ మీటింగ్ లలో పాల్గొంటూ, రోడ్ షో లు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్వశక్తులూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం వినియోగిస్తున్నారు. అందుకే తనతో పాటు మంత్రివర్గాన్ని మొత్తాన్ని ప్రచారంలోకి దించారు.

ఫలితం తర్వాత...
బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కావడంతో పాటు సెంటిమెంట్ ఏదైనా పనిచేసే అవకాశముందని భావించిన రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లే కనపడుతుంది. నిజంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక రేవంత్ పాలనకు పరీక్ష అని చెప్పాలి. రెండేళ్ల పాలనకు ఇది రెఫరెండంగానే ప్రజలు చూడకపోయినా ప్రత్యర్థులు, హైకమాండ్ చూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారంలో ఉండి ఉప ఎన్నికలో పార్టీకి విజయం సాధించి పెట్టకపోతే వచ్చే విమర్శలకు కూడా రేవంత్ రెడ్డి తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. అందుకే సైన్యాన్ని మొత్తాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలోనే మొహరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై...
మరొకవైపు ఈ ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం కూడా లోకల్ ఎన్నికలపై పడుతుంది. అయితే రేవంత్ రెడ్డి పూర్తిగా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో వచ్చాయి. అందుకే సామాజికవర్గాల వారీగా సమావేశమవుతూ రేవంత్ రెడ్డి విజయాన్ని గాంధీభవన్ కు చేరువ చేసే ప్రయత్నంలో పడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు లక్షన్నర మంది ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఓటర్లున్నారు. వీటిలో 80 శాతం ఓట్లు పడితే చాలు అని భావించారు. ఎంఐఎం మద్దతు కూడా తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆంధ్రప్రాంత ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, సినీ కార్మికులకు వరాలు ప్రకటించడం వంటి చర్యలతో ముందుకు వెళుతున్నారు. మరి చివరకు ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది చూడాలి.
Tags:    

Similar News