టీఆర్ఎస్ లోకి మరో బీసీ నేత

మునుగోడు ఉప ఎన్నికల వేళ బీసీ నాయకుల చేరిక టీఆర్ఎస్ లో కొనసాగుతుంది

Update: 2022-10-24 02:30 GMT

మునుగోడు ఉప ఎన్నికల వేళ బీసీ నాయకుల చేరిక టీఆర్ఎస్ లో కొనసాగుతుంది. మాజీ ఎంపీ, బీజేపీ నేత రాపోలు ఆనంద భాస్కర్ కేసీఆర్ తో భేటీ అయ్యారు. చేనేతపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వేయడానని రాపోలు తప్పుపట్టారు. రాష్ట్రంలో చేనేత రంగానికి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను రాపోలు ఆనంద భాస్కర్ ప్రశంసించారు. బీజేపీ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

నేతన్నలకు అన్యాయం...
చేనేత కుటుంబం నుంచి వచ్చిన తాను నేతన్నలకు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించకుండా ఉండ లేకపోతున్నానని తెలిపారు. తాను బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరతానని రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన అభినందించారు. భారత రాష్ట్ర సమితి ద్వారా జాతీయ రాజకీయాల్లోనూ కేసీఆర్ కీలక భూమిక పోషించాలని ఆయన అన్నారు.


Tags:    

Similar News