ఇన్ ఛార్జి డీజీపీగా అంజనీకుమార్

తెలంగాణ డీజీపీగా అదనపు బాధ్యతలను ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ కు ప్రభుత్వం అప్పగించింది

Update: 2022-12-29 12:33 GMT

తెలంగాణ డీజీపీగా అదనపు బాధ్యతలను ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ కు ప్రభుత్వం అప్పగించింది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పెద్దయెత్తున ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్ కు బాధ్యతలను అప్పగించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ గా డీఎస్ చౌహాన్ ను నియమించింది. అవినీతి నిరోధక శఖ డీజీగా రవిగుప్తాను నియమించింది.

పలువురు బదిలీలు...
హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా రంజిత్, శాంతిభద్రతల అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్ ను నియమించింది. అయితే డీఐజీగా పూర్తి స్థాయి అధికారి నియామకం మాత్రం చేయలేదు. డీజీపీగా అర్హులైన ఐదుగురు ఐపీఎస్ అధికారులను యూపీఎస్సీకి పంపాలి. యూపీఎస్సీ ముగ్గురిని ఎంపిక చేసి ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే అందులో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అందుకే తాత్కాలికంగా అంజనీకుమార్ ను ప్రభుత్వం నియమించింది.


Tags:    

Similar News