Harish Rao : ముగిసిన హరీశ్ రావు విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విచారణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయిన హరీశ్ రావును దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ప్రశ్నించారు

Update: 2025-06-09 07:13 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విచారణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయిన హరీశ్ రావును దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై నోటీసులు ఇచ్చి పిలిపించిన కమిషన్ హరీశ్ రావును అనేక అంశాలపై విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లు, అనుమతులకు సంబంధించిన అంశాలపై కూడా హరీశ్ రావును ఎక్కువగా కమిషన్ ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

నలభై ఐదు నిమిషాలు..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ వద్దనే ఎందుకు నిర్మించారు? దీనికి అనుమతులు ఇచ్చింది ఎవరు? ఆర్థిక అనుమతులు ఇచ్చింది ఎవరు? నిధుల విడుదల ఎలా జరిగింది? రుణాలను ఏ హామీలపై తీసుకున్నారు? తదితర అంశాల గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం ఆమోదం మేరకే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకున్నామని హరీశ్ రావు చెప్పినట్లు తెలిసింది.


Tags:    

Similar News