Telangana : నేడు తెలంగాణవ్యాప్తంగా వడ్డీలేని రుణాల పంపిణీ
నేడు తెలంగాణవ్యాప్తంగా వడ్డీలేని రుణాల పంపిణీ జరగనుంది.
నేడు తెలంగాణవ్యాప్తంగా వడ్డీలేని రుణాల పంపిణీ జరగనుంది. ఎమ్మెల్యే నేతృత్వంలో ఈ వడ్డీ లేని రుణాల పంపిణీ జరగనుది. రుణాల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
304 కోట్ల నిధులను...
వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక బృందాలకు ఇచ్చేందుకు 304 కోట్ల వడ్డీలేని రుణాలు విడుదలచేసింది. రాష్ట్రంలో ఉన్న 3,57,098 స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో నేడు ఈ నిధులను జమ చేయనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు.