Telangana : తెలంగాణలో పెరుగుతున్న వడదెబ్బ మృతులు
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అనేక మంది వడదెబ్బ తగిలి మరణిస్తున్నారు
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అనేక మంది వడదెబ్బ తగిలి మరణిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడదెబ్బకు ముగ్గురు మరణించినట్లు అధికారుల వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నరసింహులపల్లి గ్రామానికి చెందిన కుమ్మరికుంట రాజయ్య వడదెబ్బ కారణంగా మరణించారు. రాజయ్య వయసు 67 ఏళ్లు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసి ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులుఆసుపత్రికి తరలించగా, అప్పటికే రాజయ్య మరణించాడు.
మృతులు పెరుగుతుండటంతో...
అదే జిల్లాకుచెందిన తిమ్మాపురం మండలం పోలంపల్లికి చెందిన రెడ్డి రామచంద్రం కూడా వడదెబ్బ తగిలి మృతి చెందారు. రామచంద్రం వయసు ఇరవై ఆరేుళ్లు. తాపీ పనులు చేసుకునే రామచంద్రం వడదెబ్బ తగిలి మరణించినట్లు అధికారులు తెలిపారు. అలాగేగొల్లపల్లి జగన్ గౌడ్ కూడా వడదెబ్బతో మరణించాడు. తోటలో మామిడికాయలు కోసేందుకు వెళ్లి వచ్చిన జగన్ గౌడ్ వడదెబ్బతో కుప్పకూలిపోయాడు. తర్వాత ప్రాణాలు విడిచాడు. మిగిలిన జిల్లాల్లో కూడా వడదెబ్బతగిలి మరణించినట్లు వార్తలు అందుతున్నాయి.