Telangana : నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది.

Update: 2025-11-20 04:24 GMT

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాదరావు వరసగా ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. ఇప్పటకే నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాదరావు అనర్హత పై తన తుది తీర్పును వెల్లడించే అవకాశాలున్నాయి.

నేడు ఇద్దరు ఎమ్మెల్యేలు...
నేడు మరో ఇద్దరుఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను స్పీకర్ గడ్డం ప్రసాదరావు చేపట్టనున్నారు. ఈరోజు పోచారం శ్రీనివాసులురెడ్డి, అరెకపూడి గాంధీ పిటిషన్లపై వాదనలను స్పీకర్ విననున్నారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విననున్న స్పీకర్‌ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.


Tags:    

Similar News