9న విచారణకు ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావుకు అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అనుమతి ఇచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావుకు అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అనుమతి ఇచ్చింది. ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసిన ఇండియన్ ఎంబసీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది. పాస్‌పోర్ట్‌ని రద్దు చేయడంతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్‌కు ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకోవడంతో ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది.
ట్రాన్సిట్ వారెంట్ జారీ...
సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది. నేడు ఇండియాకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు బయల్దేరనున్నారు. ఈనెల 8న అర్ధరాత్రి హైదరాబాద్‌కు రానున్న ప్రభాకర్‌రావు 9వతేదీ ఉదయం సిట్ ఎదుట హాజరుకాబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్‌రావు ను విచారించేందుకు పోలీసులు తీవ్రంగా కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు.