Telangana : నేపాల్ ఉండే పౌరుల కోసం తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్
నేపాల్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక అత్యవసర హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిం
నేపాల్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక అత్యవసర హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. నేపాల్‌లో ఉన్న తెలంగాణ పౌరులకు సహాయం అందించడం, వారి కుటుంబాలకు మద్దతు ఇచ్చేందుకు ఈ హెల్ప్ లైన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
గాయపడినట్లు...
ఇప్పటివరకు ఎటువంటి తెలంగాణ పౌరులు గాయపడినట్లు, కనిపించకుండా పోయారన్న సమాచారం తమకు రాలేదని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఖాఠ్మండు లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ, తెలంగాణ పౌరుల భద్రత, వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.