Congress : పార్లమెంటు ఎన్నికల్లో టిక్కెట్ల కోసం 306 దరఖాస్తులు
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది నేతలు పోటీ పడుతున్నారు
abhishek manu singhvi, rajya sabha, congress, telangana
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు కాంగ్రెస్ అధినాయకత్వం దరఖాస్తులు కోరడంతో పెద్దయెత్తున నేతలు క్యూ కట్టారు. గాంధీభవన్ కు వచ్చి మరీ అప్లికేషన్ పెట్టి తమకు టిక్కెట్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.
ఎక్కువగా...
మొత్తం 306 దరఖాస్తులు వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ పడే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అత్యధికంగా కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ , మహబూబ్ నగర్ జిల్లాల్లో దరఖాస్తులు వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.