రెడ్ అలర్ట్..రానున్న మూడ్రోజుల్లో మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు

మంగళవారం ఉదయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా గిన్నెదరిలో ఉష్ణోగ్రతలు

Update: 2021-12-21 06:25 GMT

ఉత్తరాది రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతోందా ? అన్నట్లుగా ఉంటోంది అక్కడ చలితీవ్రత. రాష్ట్రమంతా పొగమంచు. ఇంట్లోంచి బయటికి రావాలంటేనో ప్రజలు జంకుతున్నారు. ఈశాన్యం నుంచి వీస్తున్న శీతల గాలులతో రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఉష్ణోగ్రత ఏకంగా 3.5 డిగ్రీలకు దిగజారింది. ఇదిలా ఉంటే.. రానున్న మూడ్రోజుల్లో మెర్క్యూరీ లెవల్స్ మరింత పడిపోతాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ మూడ్రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత దిగజారనున్నాయని తెలిపింది.

ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా గిన్నెదరిలో ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీలకు పడిపోగా.. బేలా, సిర్పూర్‌ (యూ)లో 3.8, అర్లి(టీ) 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలునమోదయ్యాయి. వాంకిడిలో 4.9, జైనథ్‌లో వాంకిడి లో 4.9, చాప్రాలలో 5.1, సోనాలా లో 5.2, బజార్‌హత్నూర్‌లో 5.3, లోకిరిలో 5.4 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు దిగజారాయి. ఈ ఉష్ణోగ్రతలు రానున్న మూడ్రోజుల్లో మరింత తగ్గుతాయని, ఫలితంగా పొగమంచుతో పాటు, చలి తీవ్రత కూడా పెరుగుతుందని ఐఎండీ తెలిపింది.


Tags:    

Similar News