నేడు ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్
ఫార్ములా ఈ రేసు కేసులో నేడు ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు.
ఫార్ములా ఈ రేసు కేసులో నేడు ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ ను ఒకసారి ఈ కేసులో విచారించిన ఏసీబీ అధికారులు మరొకసారి విచారించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే నోటీసులు జారీ చేసినా అరవింద్ కుమార్ విదేశాల్లో ఉండటంతో ఆయన విచారణకు హాజరు కాలేదు.
మరోసారి నోటీసులు...
దీంతో అరవింద్ కుమార్ కు నాలుగోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ను రెండోసారి ప్రశ్నించిన తర్వాత మరొకసారి అరవింద్ కుమార్ ను విచారించాని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. అందుకే నోటీసులు జారీ చేశారు. దీంతో నేడు నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న అరవింద్‌కుమార్ ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారనుంది.