Hydra : హైడ్రా కూల్చివేతలు ప్రారంభం

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.

Update: 2025-05-22 04:40 GMT

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. తెల్లవారు జాము నుంచి కూల్చివేతలను ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ శ్మశాన వాటికలపై జరిగిన కబ్జాలను కూల్చివేుస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.

శ్మశాన వాటికలను...
సర్వే నెంబర్లు 1, 12లో ఉన్న వివిధ సామాజికవర్గాలకు చెందిన శ్మశాన వాటికలను ఆక్రమించి కొందరు అక్రమ నిర్మాణాలను చేపట్టారు. కొందరు ఈ భూములను విక్రయించారని కూడా చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హైడ్రా అధికారులు వాటిని అక్రమ నిర్మాణాలుగా గుర్తించి కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టారు.


Tags:    

Similar News