నల్లమల్లారెడ్డి కళాశాలలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభం

ఘట్ కేసర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిచంి నిర్మించిన కాంపౌండ్ వాల్ ను కూల్చివేయాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు

Update: 2025-01-25 03:49 GMT

హైడ్రా కూల్చివేతలకు నేడు సిద్ధమయింది. ఘట్ కేసర్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిచంి నిర్మించిన కాంపౌండ్ వాల్ ను కూల్చివేయాలని నిర్ణయించారు. ప్రభుత్వస్థలంలో నాలుగు కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాల్ ను నిర్మించారు.నల్ల మల్లారెడ్డి ఎడ్యుకేషన్ సంస్థ ఈ భూమిని కబ్జాను చేసినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై విచారించి కూల్చివేతలకు సిద్ధమయింది.

ప్రభుత్వ స్థలాన్ని...
హైడ్రా అధికారులు ప్రభుత్వభూమిని సర్వేచేయాలని ఆదేశించడంతో సర్వేచేసిన అధికారులు దానిని ప్రభుత్వస్థలంగా తేల్చారు. దీంతో ఇక్కడ కూల్చివేతలను ప్రారంభించడానికి సిద్ధమయింది. అయితే కళాశాల యాజమాన్యం అడ్డుకుంటుందని భావించి పోలీసులు పెద్దయెత్తున మొహరించారు. ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్రమించినా దానిని స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నేడు కూల్చివేతలు జరుగుతున్నాయి.


Tags:    

Similar News