హైదరాబాద్ - విజయవాడ మధ్య ట్రాఫిక్ జాం

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది

Update: 2025-11-01 05:54 GMT

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు ఐదు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై వరద నీరు వస్తుండటంతో వాహానలను నిలిపివేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చిట్యాల రైలు వంతెన కింద భారీగా నీరు చేరింది. దీంతో హైదరాబాద్ - నార్కెట్ పల్లి వైపు వెళుతున్న వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.

వరద నీరు చేరడంతో...
పెద్ద కాపర్తి నుంచి చిట్యాల వరకూ ఐదు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు దానిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నెమ్మదిగా వాహనాలు కదులుతుండటంతో పాటు వాహనాలు నిలిచిపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ను త్వరగా క్లియర్ చేయాలని వాహనదారులు అధికారులను కోరుతున్నారు.


Tags:    

Similar News