జీఎస్టీ అధికారులపై పై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు

సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్బంధించారంటూ మహిళ ఫిర్యాదు చేయడంతో ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసులు

Update: 2022-05-20 08:01 GMT

సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్బంధించారంటూ మహిళ ఫిర్యాదు చేయడంతో ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీఎస్టీ అధికారులు సోదాలు చేశారు. సోదాల అనంతరం శ్రీధర్ రెడ్డి భార్య రాఘవి రెడ్డిని అక్రమంగా జీఎస్టీ అధికారులు నిర్బంధించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 27, 2019 రోజున తనని సెర్చ్ ఆపరేషన్ పేరుతో నిర్భదించిన అధికారుల పై నేషనల్ విమె కమిషన్‌కి శ్రీధర్‌ రెడ్డి భార్య రాఘవి రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నేషనల్ విమెన్ కమిషన్ నుండి హైదరాబాద్ పోలీసులకు సూచనలు వచ్చాయి. బాధితురాలి వద్ద నుండి వివరాలు సేకరించిన హైదరబాద్ పోలీసులు.. ఐదుగురు అధికారులపై కేస్ నమోదు చేశారు. జీఎస్టీ అధికారులు బోలినేని గాంధీ, చిలుక సుధ రాణి, ఇసాబెల్లా,ఆనంద్ కుమార్, కుచ్ లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. గతంలోనే బొల్లినేని గాంధీపై సీబీఐ కేసు నమోదైంది. ఇప్పటికే సస్పెషన్‌లో బొల్లినేని గాంధీ , చిలక సుధా ఉన్నారు.

ఈ సోదాల సమయంలోనే జీఎస్టీ అధికారులు తమను లంచం కూడా అడిగారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లంచం డబ్బులను తాము పంచుకొంటామని కూడా జీఎస్టీ అధికారులు చెప్పారని ఆమె వివరించారు. ఈ ఫిర్యాదును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.


Tags:    

Similar News