Telangana : మరికొద్ది సేపట్లో ఈ ప్రాంతంలో కుండపోత వర్షం
తెలంగాణాలో మరికొద్ది సేపట్లో భారీ వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది
తెలంగాణాలో మరికొద్ది సేపట్లో భారీ వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. గంటలకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని చెప్పింది. రానున్న రెండు రోజుల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.
మూడు రోజుల పాటు
రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచిమోస్తరు వర్షాలు పడతాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, పగటి పూట సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.