Weather Report : గుడ్ న్యూస్.. అవిగవిగో రుతు పవనాలు...మరో ఐదు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-05-17 03:58 GMT

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు , 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

ఉష్ణోగ్రతలు తగ్గుతాయని...
రానున్న ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదుకానున్నాయని చెప్పింది. హైదరాబాద్ నగరంలో ఈదురుగాలులు అధికంగా వీచే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో లో నిన్న ఉదయం వర్షం దంచికొట్టింది.. రెండు గంటల పాటు కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం అండమాన్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది.
నాలుగు రోజులు పాటు ఏపీలో...
ఆంధ్రప్రదేశ్ కు త్వరలోనే రుతుపవనాల రాక వస్తుందని చెప్పింది. జూన్ ఐదు నాటికే రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. జూన్ పదోతేదీ నాటికి రాష్ట్రమంతటా రుతుపవనాలు వీస్తాయని, వాతావరణం చల్లబడుతుందని తెలిపింది.ఈరోజు శ్రీసత్యసాయి జిల్లా, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. రానున్న నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది.


Tags:    

Similar News