Telangana : నేడు హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణలో నేడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. గ్రూప్ 1 పరీక్షలపై నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది.
తెలంగాణలో నేడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. గ్రూప్ 1 పరీక్షలపై నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు పరీక్షను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు హైకోర్టులో మరొక పిటీషన్ దాఖలు చేశారు.
గ్రూప్ 1 పిటీషన్లపై...
దీంతో ఈ రెండు పిటీషన్లపై విచారించిన హైకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. జులై 7వ తేదీన రెండు పిటీషన్లపై వాదనల విన్న ధర్మాసనం నేడు తీర్పు చెప్పనుంది. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన ఎంపిక ప్రక్రయ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దశలో ఉండటంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. నేటి తీర్పును అనుసరించి తదుపరి చర్యలను టీజీపీఎస్సీ తీసుకోనుంది.