Telangana : నేడు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి విచారణను హైకోర్టు నేటికి వాయిదా వేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి విచారణను హైకోర్టు నేటికి వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈవిచారణ చేపట్టనుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరగనుంది. నిన్న పిటీషనర్ల తరుపున వాదనలు విన్న ధర్మాసనం, ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదలను కూడా వినింది. అయితే నేడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో దానిపై స్టే ఇవ్వాలని కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది.
మిగిలిన పిటీషన్లపై...
ఈరోజు కూడా న్యాయస్థానం మిగిలిన పిటీషనర్ల తరుపున వాదనలు విననుంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఇంప్లీడ్ పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై కూడా వాదనలను ధర్మాసనం విననుంది. ఈరోజు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు చెప్పే అవకాశముంది. సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించనుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొనింది. సాయంత్రానికి రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశముంది.