శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు చేరింది.

Update: 2025-08-22 03:46 GMT

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో పదహారు గేట్లను ఎత్తి దిగువకు 49280 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్నభారీ వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాం ప్రాజెక్టు నిండుకుండల మారింది.

ప్రస్తుత ఇన్ ఫ్లో...
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుత ఇన్ ఫ్లో 80,000 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 78,812 క్యూసెక్కులుగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 79.658 టీఎంసీలుగా ఉందని తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News