Breaking: గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టు సంచలన నిర్ణయం

గ్రూప్ 1 ఫలితాలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 15 తేదీకి విచారణను వాయిదా వేసింది

Update: 2025-09-24 07:04 GMT

గ్రూప్ 1 ఫలితాలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. సంచలన తీర్పు వెల్లడించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జీ.ఎం. మొహియుద్దీన్‌ లు విచారణ జరిపారు. టీజీపీఎస్సీకి భారీ ఊరట లభించింది. నియామకాలు జరపాలని చెప్పింది. 

వాయిదా వేస్తూ...
ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ పదిహేనేళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు జరిగాయని, అంతా సజావుగానే జరిగాయని అన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో రీవాల్యుయేషన్ అనేది లేదని హైకోర్టుకు తెలిపారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అసంబద్ధమని వాదించారు. గ్రూప్ 1 రూల్స్ ప్రకారం రీ వాల్యుయేషన్ లేదని, రీకౌంటింగ్ మాత్రమే ఉందని, ఈ పరీక్షలు పారదర్శకంగా జరిగాయని అడ్వొకేట్ జనరల్ వాదించారు. ఈ వాదనలను విన్న హైకోర్టు ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. దీంతో గ్రూప్ 1 పరీక్షల్లో అభ్యర్థులకు, టీజీపీఎస్సీకి భారీ ఊరట లభించింది. తుది తీర్పునకు లోబడి నిర్ణయం ఉంటుంది. నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విచారణను వచ్చే నెల పదిహేనో తేదీకి వాయిదా వేసింది.


Tags:    

Similar News