Kalvakuntla Kavitha : నేడు కవిత కేసు సుప్రీంకోర్టులో

నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరగనుంది

Update: 2024-02-05 04:20 GMT

నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంతో కవిత ఈ పిటీషన్ దాఖలు చేశారు. మహిళలను కార్యాలయానికి పిలవకుండా, వారి ఇంట్లోనే విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని కవిత తన పిటీషన్ లో కోరారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో...
దీనిపై విచారణ గత కొద్ది కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ బేలా ధర్మాసనం కవిత పిటీషన్ ను విచారించనుంది. గత నెల 16వ తేదీన కల్వకుంట్ల కవితను విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున తాను హాజరు కాలేనని చెప్పారు.


Tags:    

Similar News