Telangana : నేడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ
నేడు తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ జరగనుంది
నేడు తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ జరగనుంది. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించడంతో వెంటనే విచారణ చేపట్టాలని కేసీఆర్, హరీశ్ రావుల తరుపున న్యాయవాదులు కోరారు. దీంతో నేడు ఇద్దరి పిటీషన్ లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారించనున్నారు.
సీబీఐకి అప్పగించడంపై...
తొలుత అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికను ప్రవేశపెట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హరీశ్ రావు పిటీషన్ వేశారు. అయితే తర్వాత సీబీఐకి ప్రభుత్వం అప్పగించడంతో సీబీఐకి అప్పగించడంపై కూడా స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై నేడు చీఫ్ జస్టిస్ విచారించనుండటంతో ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారనుంది.